MGM Scam | ఎంజీఎంలో కుంభకోణంపై.. విచారణకు వెనకడుగు!

వరంగల్ ఎంజీఎం : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఎంజీఎంలో జరిగిన భారీ కుంభకోణం (MGM Scam)పై ఎంజీఎం అధికారులు, సంబంధిత ఉన్నత అధికారులు విచారణకు వెనకడుగు వేయడంపై పలువురికి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంజీఎంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు మీడియాలో, పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత 3 సంవత్సరాలనుండి “క్రిష్ణా కన్స్ట్రక్షన్” సంస్థ కొన్ని కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు బల్ల గుద్దినట్లు వస్తున్నా కూడా.. అధికారులు కనీసం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయక పోగా.. కాంట్రాక్టర్ కు భరోసాను కల్పిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతుండటం గమనార్హం.

ఒకే ఉద్యోగి.. రెండు వేతనాలు..!

వరంగల్ ఎంజీఎంలో సేవలు అందిస్తున్న మరో ఓ ఏజెన్సీ సంస్థలో పని చేస్తూ, వేతనం కూడా అదే సంస్థలో పొందుతున్న ఓ 35 మంది పేర్లతో.. క్రిష్ణా కన్స్ట్రాక్షన్ నిర్వాహకులు తమ సంస్థలో కూడా విధులు నిర్వాహస్తున్నారని.. 35 మంది పేర్లతో అక్రమంగా తప్పుడు బిల్లులతో రూ. 2 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం.

తప్పుడు బిల్లులపై దర్జాగా సంతకాలు..!

“ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు లెక్కకు మించిన తప్పుడు బిల్లులు..
“క్రిష్ణా కన్స్ట్రక్షన్” కాంట్రాక్టర్ ఎంజీఎం అధికారులకు పంపగా.. అక్రమమం, తప్పడు పేర్లతో పంపిన బిల్లులు అని తెలిసినా.. దర్జాగా సంతకాలు చేసి కాంట్రాక్టర్ కు కోట్ల రూపాయల ప్రజల సొమ్మును అప్పనంగా అప్పజెప్పారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్రమంగా తయారుజేసిన తప్పుడు బిల్లులపై ఎంజీఎం అధికారులకు ఏమైనా వాటాలు ఇచ్చారో.. మరేదైనా ఆశ చూపారో తెలియదు కానీ.. మొత్తంగా అందరూ కలిసి ప్రజల సొమ్మును కాజేసి, జిల్లా ఉన్నత అధికారులకు, ప్రభుత్వంకు అవినీతి మరకలు అంటించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

MGM Scam : క్రిమినల్ కేసులు నమోదు చేసి.. బ్లాక్ లిస్టులో పెట్టాలి

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు క్రిష్ణా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. వాస్తవాలను ప్రజల ఎదుట నిలిపేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి, ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై, సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే సదరు ఏజెన్సీ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి, భవిష్యత్తులో ఎక్కడా కూడా టెండర్ వేయకుండా, కాంట్రాక్ట్ ఇవ్వకుండా చర్యలు తీసుకొని, ప్రజల సొమ్ముకు భద్రత కల్పిస్తూ.. ప్రభుత్వం ప్రతిష్టను కాపాడి ప్రజలకు వ్యవస్థ, సంస్థలపై నమ్మకం కలిగించాలని కోరుతున్నారు.


మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!