Mulugu | ఏమయ్యా ఎమ్మార్వో.. ఇదేం పాడు బుద్ది..!

Mulugu
  • కట్టుకున్న భార్యను వదిలేసి, వేరే మహిళతో సహా జీవనం
  • తనకు, తన పిల్లలకు తీరని అన్యాయం చేశాడాని ఎమ్మార్వో ‘గిరిబాబు’పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
  • సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఎమ్మార్వో ‘గిరిబాబు’ వ్యవహారంపై మండిపడుతున్న మహిళా లోకం
  • తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను, జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్న ఎమ్మార్వో ‘గిరిబాబు’ భార్య ఝాన్సీరాణి

Mulugu | వరంగల్ /ములుగు జిల్లా : ఆయన ఓ బాధ్యత కలిగిన మండల తహసీల్దార్. ప్రజలకు, మహిళా లోకానికి, సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన బాధ్యత కలిగిన ఎమ్మార్వో. కానీ.. కట్టుకున్న భార్యను వదిలేసి.. మరో వివాహితతో సహా జీవనం చేస్తూ.. తనను నమ్ముకొని పెళ్లాడిన సొంత భార్యనే మోసం చేశాడు. ఇద్దరు పిల్లలు సంతానం కలిగిన తర్వాత.. కట్టుకున్న భార్యను వదిలేసి, మరో మహిళతో సహా జీవనం చేస్తూ, సొంత భార్యకు, రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరు పిల్లలకు తీరని అన్యాయం చేయడాన్ని పలువురు తప్పు బడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలంలో తహసీల్దార్ గా గిరిబాబు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఎమ్మార్వో గిరిబాబుపై ఆయన భార్య ఝాన్సీరాణి.. తనను, తన పిల్లలను వదిలేసి, ఇది వరకే పెళ్లి అయిన మరో మహిళతో వేరే కాపురం పెట్టి ఆమెతో సహాజీవనం చేస్తూ, తనకు, తన పిల్లలకు తీరని అన్యాయం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, జిల్లా కలెక్టర్ ఎమ్మార్వో గిరిబాబు వ్యవహారంపై విచారణ చేపట్టి, తనకు న్యాయం చేయాలని ఝాన్సీరాణి చేతులెత్తి దండం పెడుతూ వేడుకుంటోంది.

ఎమ్మార్వో ‘గిరిబాబు’ మరో మహిళతో సహాజీవనం.. ఝాన్సీరాణికి జరిగిన అన్యాయంపై ఘంటారావమ్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ.. మీ ఘంటారావమ్ లో..

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!