PRTUTS MEMBERSHIP: ఉపాధ్యాయుల సంక్షేమమే పి ఆర్ టి యు ధ్యేయం

PRTU TS Membership: నల్లబెల్లి, ఘంటారావమ్: పి ఆర్ టి యు టీఎస్ నల్లబెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో 2026 సభ్యత్వ నమోదులో భాగంగా నారక్క పేట, నందిగామ, రంగాపురం ఉన్నత పాఠశాల, గుండ్లపాడు, పంతులుపల్లి, కన్నారావుపేట, బుచ్చిరెడ్డిపల్లి ,ఆర్షణ పల్లి, రామతీర్థం, బోలోని పల్లి, ధర్మారావు పల్లి, ముచ్చింపుల తండా, రంగాపురం, రేలకుంట, లేంకాలపల్లి పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యు టి ఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి సహకారంతో ఉపాధ్యాయులకు జూలై 15 వరకు అందరికీ ఆమోదయోగ్యమైన హెల్త్ కార్డులు సాధిస్తామని, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న పి ఆర్ టి యు టి ఎస్ సంఘంలో సభ్యత్వం స్వీకరించి సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడి పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు నల్లబెల్లి మండల ప్రధాన కార్యదర్శి బానోతు కృష్ణ, రాష్ట్ర నాయకులు గౌని చంద్రశేఖర్, రామస్వామి, కె.వెంకట్రామ నరసయ్య, జిల్లా బాధ్యులు అన్న మహేందర్, కందకట్ల నాగరాజు, శనిగరం శ్రీనివాస్, మండల కార్యదర్శి మాలోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!