తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దిగ్భ్రాంతికర హత్య ఉదంతాలు సామాన్య ప్రజానీకాన్ని వణికిస్తున్నాయి. నమ్మిన వ్యక్తులే కాలయముళ్లుగా మారుతున్న ఘటనలు సమాజంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. విశాఖపట్నంలో ఒక నావికాదళ సిబ్బంది వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ముక్కలుగా నరికిన ఘటన మరువకముందే, హైదరాబాద్‌లో సొంత తల్లిని మైనర్ కూతురు ప్రియుడితో కలిసి అంతమొందించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు వివరాలు ఇవీ..
విశాఖపట్నం ఘటన: నేవీ సిబ్బంది రవీంద్ర కిరాతకం
హత్యకు దారితీసిన పరిస్థితులు: విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ దేగా (INS Dega)లో పనిచేస్తున్న చింతద రవీంద్ర అనే నిందితుడు, 28 ఏళ్ల పోలిపల్లి మౌనికతో గత కొన్నేళ్లుగా సంబంధం కలిగి ఉన్నాడు. వీరిద్దరికీ 2021లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, కాలక్రమేణా వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.
హత్య తీరు – సాక్ష్యాల ధ్వంసం:
పోలీసుల కథనం ప్రకారం, మౌనిక తన వద్ద నుంచి రూ. 3.5 లక్షలు తీసుకోవడమే కాకుండా, వారి సంబంధం గురించి రవీంద్ర భార్యకు చెప్తానని బెదిరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రవీంద్ర ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. : నిందితుడు ఆన్లైన్లో ఒక కత్తిని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు. ఆదివారం తన గాజువాక నివాసంలో మౌనికతో గొడవ జరిగిన తర్వాత, ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, కొన్ని భాగాలను రిఫ్రిజిరేటర్లో భద్రపరిచాడు.
మిగిలిన శరీర భాగాలను, తల మరియు చేతులను అడవివరం సమీపంలోని ఒక ఖాళీ ప్రదేశంలో కాల్చివేసి సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, రిఫ్రిజిరేటర్లోని శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
హైదరాబాద్ ఘటన: ప్రేమ కోసం కన్నతల్లిని బలితీసుకున్న కూతురు
తల్లి నిరసన – కూతురి కక్ష:
Hyderabad Minor Girl Kills Mother : హైదరాబాద్‌లోని కౌకూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు అద్దం పడుతోంది. 17 ఏళ్ల మైనర్ బాలిక ఒక డ్రైవర్‌తో ప్రేమలో పడింది. అయితే, ఆ వ్యక్తి ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, కుల భేదాలు మరియు కూతురు మైనర్ కావడంతో తల్లి ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది.
- ఇంట్లోనే సమాధి: తమ ప్రేమకు తల్లి అడ్డొస్తోందని భావించిన ఆ బాలిక, తన ప్రియుడితో కలిసి తల్లిని చంపడానికి స్కెచ్ వేసింది.
- హత్య: గత ఏడాది మే 12న ప్రియుడు కత్తితో తల్లి ఛాతీలో పొడవగా, కూతురు అతనికి సహకరించింది. హత్య అనంతరం మృతదేహాన్ని ఎక్కడికీ తీసుకెళ్లకుండా, ఇంటి లోపలే గోతి తీసి పూడ్చిపెట్టారు.
- సిమెంట్ పోత: ఎవరికీ అనుమానం రాకుండా ఆ గొయ్యి పైన ఇసుక, సిమెంటుతో పూడ్చేసి సాధారణంగా జీవించడం మొదలుపెట్టారు.
- పోలీసుల వేట: చాలా కాలం తర్వాత ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటిని సోదా చేయగా, మృతదేహం వెలికివచ్చింది. మల్కాజ్గిరి పోలీసులు నిందితుడైన డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా, మైనర్ బాలికను జువైనల్ హోంకు పంపారు.
