పౌరుల సొమ్ము దుర్వినియోగం రాజ్యాంగ విరుద్ధం! – Z Plus Security

Z Plus Security

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్‌కు కల్పించిన జడ్ ప్లస్ కేటగిరీ (Z Plus Security ) భద్రతను సవాలు చేస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court)లో నాగపూర్ కి చెందిన సామాజిక కార్యకర్త లాలన్ కిషోర్ కుమార్ పిటిషన్ వేశారు.

ఆర్‌ఎస్‌ఎస్ అనేది ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా నమోదిత సంస్థ కాదని, అటువంటప్పుడు చట్టబద్ధత లేని ఒక సంస్థ ప్రతినిధి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ధారపోయడం పూర్తిగా చట్టవిరుద్ధమని పిటిషనర్ వాదించారు.

జడ్ ప్లస్ భద్రత కోసం రోజుకు సగటున రూ.1.5 లక్షల వరకు, అంటే నెలకు దాదాపు రూ.45 లక్షల ప్రజా ధనం ఖర్చవుతున్న నేపథ్యంలో, ఈ వృథా ఖర్చును ఆయన నుండే వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

2015 కంటే ముందు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ఉండే వై ప్లస్ భద్రతలో ఉన్న భాగవత్‌కు, ఒక్కసారిగా ఈ స్థాయి బందోబస్తు పెంచడం వెనుక అసలు ముప్పు కంటే కూడా రాజకీయ పలుకుబడిని, సామాజిక హోదాను చాటుకునే ప్రయత్నమే కనిపిస్తోందనే పిటిషనర్ వాదించారు.

దేశంలో భద్రతా వ్యవస్థ అనేది ప్రాణహాని కంటే కూడా ఒక ‘స్టేటస్ సింబల్’గా మారిందని, ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం కోట్లాది రూపాయల పౌరుల సొమ్మును దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు.

అయితే, ఈ లోతైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే కనీసం విచారణకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిందని.. దీనిని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్లినట్లు సమాచారం.


తాజా వార్తల అప్‌డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి:
నిజమైన, నిష్పక్షపాత వార్తలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందడానికి మా సోషల్ మీడియా వేదికల్లో X (Twitter), Facebook, WhatsApp Channel ) జాయిన్ అవ్వండి:

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!