ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Oplus_131072

TGEJAC AGITATION: నల్లబెల్లి, ఘంటారావమ్: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ… తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం నల్లబెల్లి మండలంలో టీజీ ఈజెఏసి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నల్లబెల్లి తహసిల్దార్ ఆఫీస్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడారు. జూన్ 2 వరకు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను 2 విడతల్లో చెల్లించాలని, మే 1 నుండి హెల్త్ కార్డు విధానాన్ని అమలు పర్చాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు పరచాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. నల్లబెల్లి మండల తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ గారికి మెమోరండం ఇచ్చారు. అంతకు ముందు సీపీ ఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు, పీఆర్సీ ప్రకటించాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టిఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉడుత రాజేందర్, భానోత్ కృష్ణ డిటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందుల గోవర్ధన్, పూజారి రవి, యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.రాజిరెడ్డి, జి.అశోక్, తెలంగాణ పిఆర్టియు మండల అధ్యక్షులు దస్రు, ఉపాధ్యాయులు కర్ణకంటి రామ్మూర్తి, కునమల్ల రాజన్ బాబు, మండలంలోని వంద మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!