Scam Secure1 | సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపిస్తున్న 17 ఏళ్ల కుర్రాడు..

Scam Secure1
  • సాఫ్ట్‌వేర్‌ రూపొందించిన అర్జున్ రామ్
  • బాధితులకు అండగా నిలుస్తున్న 17ఏళ్ల యువకుడు

సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు. సైబర్ నేరాలు అమాయకపు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. బాధితులకు అండగా నిలువలనే ఉద్దేశంతో 17 ఏళ్ల యువకుడు స్కాంసెక్యూర్ -1 (Scam Secure1) అనే వెబ్ సైట్ ను రూపొందించారు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన ‘Scam Secure1’

2025లో ప్రారంభించిన ఈ వెబ్ సైట్ ను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం విశేషం. సైబర్ మోసాలను గురైన బాధితులు తక్షణమే ఫిర్యాదు చేసేలా ఈ వెబ్ సైట్ ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ విభాగంతో నేరుగా అనుసంధానం కావడం వల్ల బాధితులు సమర్పించే ఫిర్యాదులపై కేవలం కొన్ని గంటల్లోనే ఫలితం లభిస్తుందని అంటున్నారు.

ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోవడం వల్ల దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు అర్జున్ రామ్ తెలిపారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఆలోచనతో ఈ వినూత్న ప్రయోగం చేసినట్లు తెలిపారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయకూడదని, నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ట్రేడింగ్ చేయకూడదని అంటున్నారు.

సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా ఈ Scam Secure1 వెబ్ సైట్ ను చాలా సులభంగా రూపొందించినట్లు, వినియోగదారులు సులభమైన లాగిన్ ప్రక్రియ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ వెబ్సైట్లో జరిగిన మోసం గురించి వివరణ సమర్పించి ఫిర్యాదు చేయవచ్చని అందిన వెంటనే వెబ్సైట్ బృందం సైబర్ క్రైమ్ విభాగం సమన్వయంతో తక్షణ చర్యలు చేపడతామన్నారు. బాధితులకు వందశాతం న్యాయం జరిగే విధంగా ఈ వెబ్సైట్ను రూపొందించినట్లు అర్జున్ రామ్ తెలిపారు. చిన్న వయసులోనే సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న అర్జున్ రామ్ ప్రయత్నాన్ని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.


మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!