free Note Books For Govt Students: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు

Free Note Books For Govt Students: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు
నోటు పుస్తకాల పంపిణీ
పరకాల, జూన్ 23 : పరకాల మండలం పోచారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మంగళ వారం గ్రామానికి చెందిన గోవిందు కుమారస్వామి రూ. 10 వేల విలువ చేసే నోటు పుస్తకాలను గ్రామ సర్పంచ్ పెంతల మధూకర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఇంచార్జి హెచ్ ఎం మంజుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దాత కుమారస్వామి మాట్లాడుతూ..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని, విద్యార్థుల్లో చేతి రాత నైపుణ్యం పెంపొందే విధంగా చూచిరాత పుస్తకాలు, పెన్సిల్లు, స్కేల్ తదితర వస్తువులకు అందజేసినట్లు తెలిపారు.

Free Note Books For Govt Students:
సర్పంచ్ మధుకర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రాథమిక పాఠశాలలో పునాది అత్యంత అద్భుతంగా ఉండేలా, పిల్లల్లో చేతిరాత నైపుణ్యాన్ని పెంపొందించే ముఖ్య ఉద్దేశ్యంతో చూచిరాత కాపీలను అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో పాఠశాల విద్యార్థులకు అవసరమైన చూచిరాతలకు సంబంధించిన సామాగ్రిని ప్రతి సంవత్సరం అందిస్తానని చెప్పడం గొప్ప విషయమన్నారు.
1 నుండి ఏడో తరగతి విద్యార్థులకు ఈ వస్తువులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోలపాక చందు, మాజీ సర్పంచ్ నీరటి అశోక్, భాస్కర్, కుమారస్వామి, మురళి, సంతోష్ పాఠశాల ఉపాధ్యాయులు డి.మోహన్, కే.మోహన్, సురేందర్, బిక్షపతి, మమత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!