ఎంజీఎంలో భారీ కుంభకోణం..! (MGM Hospital Scam)

MGM Scam

MGM Hospital Scam | వరంగల్ ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఎంజీఎంలో అవినీతి గద్దలు కోట్ల రూపాయలను ఎత్తుకొని పోయారు. చాలీ చాలని బడ్జెట్ తో, ప్రజల సొమ్ముతో కాలం ఎల్లదీస్తున్న ఎంజీఎం ఆసుపత్రిలో.. “మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా” ఎంజీఎంకు కేటాయించిన కోట్ల రూపాయలను ఓ కాంట్రాక్టర్ కాజేశాడన్న వార్తలు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

5-8 కోట్ల రూపాయలకు స్కెచ్..!

3 సంవత్సరాలుగా.. 35 మంది బోగస్ పేర్లతో కొట్టేసిన డబ్బులు.. ఒక లక్ష కాదు రెండు లక్షలు కావు.. ఏకంగా 2 కోట్ల 1లక్ష 16 వేల రూపాయలు (5 నుంచి 8 కోట్ల రూపాయలు కూడా ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి).

MGM Hospital Scam : వడ్డించేటోడు మనోడైతే ఆ కిక్కే వేరబ్బ..!

ఎనుకటికి ఓ సామెత ఉండేది. వడ్డించేటోడు మనోడు అయితే పెళ్లి బంతిలో ఏడ కూర్చుంటే ఏంటీ అని. ఇప్పుడు ఎంజీఎంలో జరిగిన కోట్ల రూపాయల కోణంలో కూడా అదే జరిగింది. తప్పుడు బిల్లులపై సంతకాలు పెట్టే సార్లు మనోళ్లు అయితే చాలు దోచెయ్యడానికి అన్నట్లుగా జరిగిన ఓ కుంభకోణం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ఎంజీఎంలో ఓ కాంట్రాక్టర్ కు సంబందించిన బోగస్ ఉద్యోగుల పేర్లతో పాటు తప్పుడు బిల్లులతో కోట్ల రూపాయలు కాజేయగా.. అందుకు పెద్దలు ఎలాంటి అభ్యంతరం లేకుండా, కనీసం పరిశీలించకుండా దర్జాగా సంతకాలు చేసి అవినీతి గద్దలకు కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కట్టబెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై ప్రజలు, ప్రజా సంఘాలు, కొంతమంది ఉద్యోగులు విమర్శలు, పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ కాజేసిన కోట్ల రూపాయల ‘అవినీతి సొమ్ములో ఎవరెవరికి.. ఎంత వాటా ఉందో’ అని లెక్కలేస్తూ.. వడ్డించేటోడు మనోడైతే.. ఆ కిక్కే వేరబ్బ అని అంటున్నారు ప్రజలు.

(MGM Hospital Scam : మరిన్ని పూర్తి వివరాలు మీ ‘ఘంటారావమ్’లో.. )

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!