హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ రామనర్ససింహ రావు సస్పెన్షన్​ – Sub registrar suspended

Sub registrar suspended

వరంగల్ /హన్మకొండ : వరంగల్/హన్మకొండ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ రాజీవ్ంధీ హన్మంతు ఉత్తర్వులు జారీ చేశారు. (Sub registrar suspended) ఈ ఉత్వర్వులు సోమవారం(నేడు) వరంగల్ కార్యాలయానికి చేరుకోనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘ఘంటారావమ్’ వరుస కథనాలు అందించిన విషయం పాఠకులకు తెలిసిందే.

ఈ నెల 3న అవినీతి నిరోధక శాఖ అధికారులు వరంగల్/హన్మకొండ (వడ్డేపల్లి) ఆర్వో కార్యాలయం మీద దాడులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ ఆస్తులను గుర్తించారు. అవినీతికిపాల్పడినందుకుగాను సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. రామనర్సింహారావుపై చర్యల కోసం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ సుభాషిణి కమిషనర్ కు సమర్పించారు

ఆయనపై ఈ నెల 10న చర్యలు తీసుకున్నారు. కానీ సెలవులు రావడంతో ఉత్తర్వులు ఇంకా వరంగల్ కార్యాలయానికి అందలేదు. వరంగల్/హన్మకొండ ఆర్వో కార్యాలయంలో ఏక కాలంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడటం, అక్రమ ఆస్తులు కలిగి ఉండటం సంచలనం కలిగించింది. రామనర్సింహారావు, ఆనంద్ మధ్య ఆన్లైన్లో రూ.43 లక్షల లావాదేవీలు జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించిన విషయం తెలిసిందే.

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!